The New City Church Podcast - Telugu

Supernatural Financial Increase - అతీతమైన ఆర్ధిక అభివృద్ధి

1 h 10 min · 11 mei 20261 h 10 min
aflevering Supernatural Financial Increase - అతీతమైన ఆర్ధిక అభివృద్ధి cover

Beschrijving

నిజమైన సమృద్ధికి దారితీసేది ఏమిటి? తన పిల్లల కొరకు ముఖ్యంగా ఆర్థిక విషయాలలో, దేవుని చిత్తం ఏమిటో ఈ సందేశంలో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు విశ్వాసులకు గుర్తుచేస్తున్నారు. వారు మొదట మన మనస్సు వర్థిల్లుట పునాదిగా అవసరమని బోధిస్తూ, దేవునికి మరియు ఆయన మన జీవితాల్లో ఉంచిన నాయకులకు మనలను మనము పూర్తిగా సమర్పించుకొనుట ద్వారా, అలాగే ఇచ్చుట విషయంలో ఉన్న భయాన్ని విడిచిపెట్టుట ద్వారా, దేవుడు మన కొరకు సిద్ధం చేసిన సమృద్ధియైన జీవితాన్ని అనుభవించగలమని తెలుపుతున్నారు. మీరు మీ ఉదారతకై ప్రసిద్ధి చెంది, మీ ఆదాయం వల్ల మీరు పరిమితపరచబడకుండా, మీ త్యాగపూర్వకమైన ఇచ్చుట ద్వారా అనేకులు దేవుని రాజ్యంలోనికి వచ్చుదురు గాక. ఆమేన్!

Reacties

0

Wees de eerste die een reactie plaatst

Meld je nu aan en word lid van de The New City Church Podcast - Telugu community!

Begin hier

2 maanden voor € 1

Daarna € 9,99 / maand · Elk moment opzegbaar.

  • Podcasts die je alleen op Podimo hoort
  • 20 uur luisterboeken / maand
  • Gratis podcasts
Begin hier

Alle afleveringen

89 afleveringen

aflevering The Father's Promise - The Holy Spirit తండ్రి వాగ్దానం - పరిశుద్ధాత్మ artwork

The Father's Promise - The Holy Spirit తండ్రి వాగ్దానం - పరిశుద్ధాత్మ

మీరు నిజంగా శక్తివంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నారా? ఈ వర్తమానములో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు, పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పని చేశాడో, మరియు ఇప్పుడు నూతన నిబంధనలో పరిశుద్ధాత్మకు సంబంధించి విశ్వాసులకున్న వాస్తవికత ఏమిటో వివరిస్తున్నారు. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ కొంత కాలం మాత్రమే మనుష్యుల మీదకు దిగి వచ్చే వాడు; కానీ ఇప్పుడు క్రీస్తులో ఉన్న ప్రతి విశ్వాసిలో ఆయన ఇప్పుడు శాశ్వతంగా నివసిస్తున్నాడని పాస్టర్ గారు వెల్లడిస్తున్నారు. ఈ సందేశం పరిశుద్ధాత్మను కలిగి ఉండటం యొక్క ప్రాముఖ్యతపై మీకు బలమైన పునాదిని వేయడానికి మాత్రమే కాక, తండ్రి ఇచ్చిన ఈ అమూల్యమైన వరమైన పరిశుద్ధాత్మ ద్వారా దేవునితో మీ సాన్నిహిత్యాన్ని మరింతగా పెంచుకోవడానికి సహాయపడుతుంది. మీరు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొంది, దేవుని మహిమ కొరకు మీ జీవితాలు సమూలంగా మార్చబడును గాక!

19 mei 20261 h 8 min
aflevering Supernatural Financial Increase - అతీతమైన ఆర్ధిక అభివృద్ధి artwork

Supernatural Financial Increase - అతీతమైన ఆర్ధిక అభివృద్ధి

నిజమైన సమృద్ధికి దారితీసేది ఏమిటి? తన పిల్లల కొరకు ముఖ్యంగా ఆర్థిక విషయాలలో, దేవుని చిత్తం ఏమిటో ఈ సందేశంలో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు విశ్వాసులకు గుర్తుచేస్తున్నారు. వారు మొదట మన మనస్సు వర్థిల్లుట పునాదిగా అవసరమని బోధిస్తూ, దేవునికి మరియు ఆయన మన జీవితాల్లో ఉంచిన నాయకులకు మనలను మనము పూర్తిగా సమర్పించుకొనుట ద్వారా, అలాగే ఇచ్చుట విషయంలో ఉన్న భయాన్ని విడిచిపెట్టుట ద్వారా, దేవుడు మన కొరకు సిద్ధం చేసిన సమృద్ధియైన జీవితాన్ని అనుభవించగలమని తెలుపుతున్నారు. మీరు మీ ఉదారతకై ప్రసిద్ధి చెంది, మీ ఆదాయం వల్ల మీరు పరిమితపరచబడకుండా, మీ త్యాగపూర్వకమైన ఇచ్చుట ద్వారా అనేకులు దేవుని రాజ్యంలోనికి వచ్చుదురు గాక. ఆమేన్!

11 mei 20261 h 10 min
aflevering Faith for Breakthrough - విడుదల కలుగజేయు విశ్వాసము artwork

Faith for Breakthrough - విడుదల కలుగజేయు విశ్వాసము

మీ జీవితములో అడ్డంకులను దాటి, దేవుని వంటి ఫలితాలను చూడటానికి, సహాయపడే ఆ ఒకే ఒక్క విషయం ఏమిటి? మీ సందిగ్ధాన్నంతా తీర్చే ఈ వర్తమానంలో, విశ్వాసులు దేవుని వాక్యంతో తమ జీవితాలను ఎలా నిర్మించుకొని, ఆరోగ్యం, ఆర్థిక స్థితి, సంబంధాలు లేదా జీవితంలోని ఏ ఇతర రంగంలోనైనా గొప్ప విడుదలను ఎలా పొందుకోవచ్చో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు ఈ సందేశములో బోధిస్తున్నారు. విశ్వాసులు పరిమితులను దాటి, దేవుని వాగ్దానాలతో ఏకీభవించి, వాటిని నిజంగా అనుభవించడానికి తమను తాము ఎలా సరైన స్థానంలో  ఉంచుకోవాలో వారు వెల్లడిస్తున్నారు. ఇది మీరు పొందుకొనే దినం. ఈ రోజే మీరు మీకు కావలసిన దానిని పొందుకునే రోజు. యేసు నామములో ఆకస్మిక మరియు శక్తివంతమైన విజయాలు మీవై ఉండును గాక. ఆమేన్!

5 mei 202652 min
aflevering Wisdom for Godly Parenting - దైవికముగా పిల్లలను పెంచుటకు జ్ఞానము artwork

Wisdom for Godly Parenting - దైవికముగా పిల్లలను పెంచుటకు జ్ఞానము

దైవికముగా పిల్లలను పెంచుటకు మీకు జ్ఞానము ఉన్నదా? మీ కుటుంబ నేపథ్యమేదైనా, ప్రతి తల్లి, తండ్రి, సంరక్షకులు ఖచ్చితముగా తెలుసుకోవాల్సిన 7 వాక్యాధారిత సూత్రాలతో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి గారు ఈ సందేశములో మనలను సిద్ధపరుస్తున్నారు. పిల్లల పెంపకానికి ప్రధానాంశాలను, ఒక బిడ్డను శిక్షణ చేయుటలో పలు విధానాలను వారు మనతో పంచుకుంటూ, మనము ఆలోచించి ఆచరణలో పెట్టాల్సిన కొన్ని ప్రశ్నలతో చివరిగా ముగిస్తారు.  మీరు తల్లిదండ్రులైనా, లేదా తల్లి, తండ్రి కాబోయే వారైనా దేవుని మహిమ కొరకు లోకంపై ప్రభావం చూపే పిల్లలను పెంచడానికి ఒక మార్గదర్శిగా ఈ వర్తమానాన్ని పరిగణించండి. దైవిక పెంపకంతో, మీ పిల్లలు జీవితంలో ఎన్నో పోరాటాలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదని గుర్తుంచుకోండి.

28 apr 202656 min
aflevering The Precious Blood of Jesus - అమూల్యమైన యేసు రక్తము (మన స్వాస్థ్యమునకు మూలం) artwork

The Precious Blood of Jesus - అమూల్యమైన యేసు రక్తము (మన స్వాస్థ్యమునకు మూలం)

యేసు రక్తం ఎందుకు ఎంతో అమూల్యమైనది? అది మన స్వాస్థ్యమునకు ఎందుకు మూలం? ఈ వర్తమానంలో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు యేసు రక్తం యొక్క ప్రాముఖ్యతను మరియు ప్రతి విశ్వాసి జీవితంలో దాని ముఖ్య పాత్రను వివరిసున్నారు. యేసు రక్తం ఎందుకు అమూల్యమైనదో ఏడు శక్తివంతమైన కారణాలను పాస్టర్ గారు పంచుకుంటూ ఆ రక్తం మన కొరకు ఏమి సాధించింది, నూతన నిబంధనలో మన కొరకు ఏమి సంపాదించిందో వెల్లడిసున్నారు. ఈ సందేశం ద్వారా యేసు రక్తం ద్వారా మీరు పొందిన గొప్ప స్వాస్థ్యములో ధైర్యంగా నడచుటకు, మరియు మీరు కుమారునిగా, వారసునిగా, జయించిన వారిగా జీవించుటకు సహాయపడుతుంది!

21 apr 202651 min