
The New City Church Podcast - Telugu
Podcast by New City Church
Rajoitettu tarjous
3 kuukautta hintaan 1 €
Sitten 7,99 € / kuukausiPeru milloin tahansa.

Enemmän kuin miljoona kuuntelijaa
Tulet rakastamaan Podimoa, etkä ole ainoa
Arvioitu 4.7 App Storessa
About The New City Church Podcast - Telugu
Welcome to the New City Church Podcast with Ps. Benjamin Komanapalli. Join us each week as we seek to deepen our understanding in the Word of God, explore Biblical truths, grow in radical faith, and lead a victorious life in Christ. Follow us on Instagram @newcityhyd to receive all the latest updates!
Kaikki jaksot
83 jaksotదేవుని రాజ్యములోనికి, విశ్వాసుల జీవితాల్లోనికి ధనము ఎలా ప్రవహించాలో అనే విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? సంపద బదిలీని గురించిన మర్మాన్ని, లోకస్థుల చేతుల్లో నుంచి, తన బిడ్డల చేతుల్లోనికి దేవుడు వనరులను వ్యూహాత్మకంగా ఎలా మారుస్తాడో ఈ శక్తివంతమైన సందేశంలో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు వివరిస్తూండగా వినండి. ఈ వర్తమానంలో, మీరు ఈ విషయాలను తెలుసుకుంటారు: • సంపద బదిలీ జరిగే 3 విధానాలు: వ్యూహము ద్వారా, విడుదల ద్వారా, బలవంతముగా. • దుష్టులు మరియు నీతిమంతుల మీద ఈ 3 విధానాల ప్రభావము. • విశ్వాసులు, దుష్టులు మరియు దేవుడు ఎలా ఈ సంపద బదిలీ జరిగే ప్రతి విధానాన్ని నిర్ణయిస్తారు? • దేవుని రాజ్య సంపదను బలోపేతం చేసే జ్ఞానపు 5 కోణాలు. • పాపాత్ముడు పోగు చేసినదానంతటితో సహా ఒక మంచి వ్యక్తి ఎలా ఙ్ఞానాన్ని, తెలివిని, ఆనందాన్ని పొందుకుంటాడు? మీరీ సందేశాన్ని వింటూండగా, దేవుని రాజ్యపు సంపదను గురించి మీకున్న జ్ఞానము పెరిగి, నమ్మకమైన గృహనిర్వాహకునిగా ఉండుటకు మీరు దైవిక జ్ఞానములో ఎదుగుతూ గొప్ప దేవుని రాజ్య పెట్టుబడిదారుగా ఉందురు గాక!
ఆర్థికంగా మరో మెట్టుకు ఎదగాలనుకుంటున్నారా? దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మరింతగా చేయాలని కోరుతున్నారా? అయితే, ఈ పాడ్కాస్లో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు తలాంతుల యొక్క ఉపమానము ద్వారా ఆర్థిక విషయాలను గురించిన కాలాతీతమైన వాక్య జ్ఞానాన్ని పంచుకుంటూండగా వినండి. మీరీ సందేశాన్ని వింటూండగా మీ వనరులను జ్ఞానయుక్తంగా నిర్వహిస్తూ దేవుని రాజ్యంలో ధారాళంగా పెట్టుబడి పెట్టడానికి మీరు ప్రేరణ పొందాలని మా ప్రార్థన. మీరు అమితంగా ఆశీర్వదించబడి గొప్ప దేవుని రాజ్య పెట్టుబడిదారుగా ఉందురు గాక.
గురుగుల మధ్యలో కూడా గోధుమ వలె పెరగండి! రూపాంతరం చెందిన వ్యక్తులు లోకపు వ్యవస్థలను ఎలా ప్రభావితం చేస్తారో, దేవుని రాజ్యాన్ని ప్రతిబింబించే గోధుమలు గురుగులు అనే ఉపమానము ద్వారా పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు మనకు ఈ వర్తమానంలో చూపిస్తున్నారు. మీరీ సందేశాన్ని వింటూండగా మీ కోరికలు, పనులు మరియు మీ జీవితము ఇతరులను ప్రభావితం చేసిన విధానాన్ని గురించి ఒక సారి ఆలోచించండి. మంచి మార్పును తీసుకువచ్చే గోధుమ వలె, చీకటిలో వెలుగుగా ప్రకాశించడానికి మీ జీవితములో మూడు తక్షణ చర్యలను ఇప్పుడే తీసుకోండి. మీరు సరైన నేలలో ఇష్టపూర్వకంగా నాటబడిన విత్తనంగా ఉండి, దేవుని మహిమ కోసం శాశ్వత ప్రభావాన్ని చూపుదురు గాక!
అర్థవంతమైన విధానాల్లో, లోకము గమనించునట్లు దేవుని మహిమను ప్రతిబింబించగలిగే దైవికమైన కృపను ఎలా పొందుకోవాలో ఈ పాడ్కాస్ట్ ద్వారా పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి గారు విశ్వాసులను బలపరుస్తున్నారు. మీరీ సందేశాన్ని వింటూండగా, దేవుని మహిమార్థమై మీరు అధికముగా ఫలించుటకున్న దైవిక క్రమాన్ని పాటించుటకు కట్టుబడియుండి, తద్వారా క్రీస్తు రక్షణ కృప వైపునకు ప్రజలను త్రిప్పుతారని మా ప్రార్థన. దేవుని మహిమను కనపరచుటకు మీరు ఏర్పరచబడ్డారు. ఆ మహిమలో నడుస్తూ ఉండండి!
గాయపు మచ్చలు ఎంత లోతున్నా - నిరీక్షణ అంత కంటే ఎక్కువగా ప్రకాశిస్తుంది. బాధపరచబడ్డారా? తిరస్కరించబడ్డారా? అలక్ష్యం చేయబడ్డారా? స్వస్థత, నిరీక్షణ, ఓదార్పునిచ్చే పాస్టర్ అర్పిత కొమానపల్లి గారి ఈ వర్తమానాన్ని వినండి. మీ గాయాలను తన మహిమకు నిదర్శంగా మార్చుటకు దేవుడు ఒక వజ్రము వలె ఎలా మిమ్మల్ని ప్రేమతో రూపించి మలచి, మెరుగుపరుస్తాడో తెలుసుకోండి. మీ బాధలను అధిగమించి, దేవుని ప్రియమైన బిడ్డగా మీకున్న గుర్తింపును స్వీకరించి, బలంగా నిలిచి, నూతన బలం మరియు ధైర్యంతో నడుస్తూ ఉందురు గాక. యేసు నామంలో, ఆమేన్!

Enemmän kuin miljoona kuuntelijaa
Tulet rakastamaan Podimoa, etkä ole ainoa
Arvioitu 4.7 App Storessa
Rajoitettu tarjous
3 kuukautta hintaan 1 €
Sitten 7,99 € / kuukausiPeru milloin tahansa.
Podimon podcastit
Mainoksista vapaa
Maksuttomat podcastit

































