
Englisch
Gratis en Podimo
Starte jetzt und verbinde dich mit deinen Lieblingspodcaster*innen
Mehr The New City Church Podcast - Telugu
Welcome to the New City Church Podcast with Ps. Benjamin Komanapalli. Join us each week as we seek to deepen our understanding in the Word of God, explore Biblical truths, grow in radical faith, and lead a victorious life in Christ. Follow us on Instagram @newcityhyd to receive all the latest updates!
Created for Good Works - సత్కార్యముల కొరకు సృష్టింపబడితిమి
మీరు క్రైస్తవులా? అయితే, మీ విశ్వాసాన్ని మీ జీవితములో ఎలా కనపరుస్తారు? ఇతరులను నిందించుటకు తొందరపడుతుంటారా? ట్రాఫిక్‌లో తొందరగా చిరాకుపడిపోతుంటారా? ఎప్పుడూ స్వీయ జాలితో కుమిలిపోతుంటారా? మీ ఆర్ధిక విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారా? అలా అయితే, మీరు కలిగి ఉన్నారని చెప్పుకుంటున్న ఆ విశ్వాసాన్ని నిశితంగా పరిశీలించాల్సిన సమయమిదే. ఈ కనువిప్పు కలిగించే ప్రసంగములో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు మన పనులకు, మాటలకు, ఆలోచనలకు, డబ్బును వాడే విధానానికి పర్యవసానాలుంటాయని, మంచి కార్యాలకు మంచి ప్రతిఫలము, చెడు కార్యాలకు చెడు ప్రతిఫలము ఉంటుందని విశ్వాసులకు గుర్తుచేస్తున్నారు. మంచి కార్యాలు చేయుటకే కృప మనకు అనుగ్రహించబడింది. మీ విశ్వాసానికి, మీ కార్యాలకు మధ్య పొంతన లేదని మీరు ఒప్పింపబడుతుంటే, ఈ రోజే దానిని మార్చుకొనుటకు ఈ సందేశము మిమ్మల్ని ప్రేరేపించనివ్వండి. మీ మంచి కార్యాలు విస్తరించి, లోకములోని అన్యులు క్రీస్తు వైపునకు త్రిప్పబడుదురు గాక. ఆమేన్!
Faith, Works & Rewards - విశ్వాసము, క్రియలు, ప్రతిఫలములు
స్పష్టమైన ఫలితాలను ఉత్పత్తి చేసే నిజమైన విశ్వాస జీవితాన్ని కలిగియుండుట అంటే ఏమిటి? విశ్వాసులను బలపరిచే ఈ సందేశములో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు విశ్వాసము, వాక్యాధారిత క్రియల మధ్య ఉన్న క్రియాశీలక సంబంధాన్ని గురించి తేటగా తెలియజేస్తున్నారు. ప్రతీ విశ్వాసి తన విశ్వాసము మృతమైపోకుండా అది పరిపూర్ణమగునట్లు, తన విశ్వాసపు మంటను తప్పక ఎలా రగిలిస్తూ ఉండాలో ఇక్కడ కనుగొనండి. స్వచ్ఛమైన విశ్వాసము క్రియల ద్వారా ఎలా విశదమవుతుందో మరియు ఉద్దేశపూర్వకంగా చేసే క్రియలు దేవుని వాగ్దానాలను పొందుకునే స్థానములోనికి మిమ్ములను ఎలా తీసుకువచ్చి దేవుడు మీ కొరకు ఉంచిన ప్రతిఫలాలన్నిటినీ పొందుకొనుటకు ఎలా కారణమవుతాయో తెలుసుకోండి. మీరీ వర్తమానాన్ని వింటూండగా, మీ హృదయం మీ విశ్వాసాన్ని మరింతగా పెంచుకోవడానికి, మీ కార్యాలను బలోపేతం చేయడానికి మరియు మీ జీవితానికై దేవుడు కోరుకునే ప్రతిఫలాల్లోనికి ధైర్యంగా మిమ్ములను నడపడానికి ప్రేరేపించబడును గాక!
The Grace, The Race & The Reward - కృప, పందెము ప్రతిఫలము
మీరు జీవితములో స్తంభించిపోయినట్లుగా అనిపిస్తుందా? మీ సామర్థ్యాన్నికనుగుణంగా నిజంగా మీరు జీవిస్తున్నారా లేదా అని ఆలోచిస్తున్నారా? కనువిప్పు కలిగించే ఈ సందేశములో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు దేవుడనుగ్రహించిన బహుమతులను సద్వినియోగం చేసుకొని, మీపైయున్న ప్రత్యేకమైన దైవిక ఉద్దేశ్యాన్ని నెరవేర్చుట ఎలాగో బోధిస్తూండగా వినండి. అలాగే, మీ స్వంత పందెముపై దృష్టి నిలిపి, ఇతర విషయాలచే మరల్చబడకుండా, మీ పనిని చక్కగా పూర్తి చేసినందుకై ఎలా ప్రతిఫలాలను పొందవచ్చో నేర్చుకొనండి. ప్రతిఫలాలు, బహుమతుల మధ్య ఉన్న వాక్యానుసారమైన భేదాన్ని కనుగొని, మీ పందెమును శ్రద్ధతో ఉద్దేశ్యపూర్వకంగా పరుగెత్తుటకు సిద్దపడండి. లెక్క అప్పజెప్పాల్సిన వారిగా బాధ్యతాయుతులమై దేవుని కృపను సద్వినియోగం చేసుకుందాం.
Lifestyle of Thanksgiving - కృతజ్ఞతతో కూడిన జీవనశై
ఒక విశ్వాసిగా మీరు కృతజ్ఞత కలిగిన హృదయమనే వాస్తవికతలో నిజంగా నడుస్తున్నారా? గొప్ప పరివర్తన కలిగించే ఈ వర్తమానంలో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు కాలానుగుణమైన లేక పరిస్థితులాధారితమైనది కాక ప్రాథమికమైనదిగా మనము కలిగియుండాల్సిన కృతజ్ఞత జీవనశైలి యొక్క లోతు మరియు శక్తిని మన కొరకు వెలికితీస్తున్నారు. ఈ సందేశములో ప్రతి విశ్వాసి జీవితంలో కృతజ్ఞత ఎందుకు ఆవశ్యకమో మరియు అది దేవునితో మీ నడకను ఎలా రూపుదిద్దుతుందో కనుగొనండి. కృతజ్ఞత యొక్క ముఖ్య అంశాలను నేర్చుకొని, నిరంతరం కృతజ్ఞత చెల్లిస్తూ ఉండుట దేవుని మంచితనాన్ని మరింత స్పష్టంగా చూడటానికి మిమ్మల్ని ఎలా సరి ఐన స్థానములో ఉంచుతుందో అర్థం చేసుకోండి. మీరు ఈ వాక్యాన్ని వింటూండగా, మీ హృదయము అనుదిన కృతజ్ఞతను అలవరచుకొనుటకు ప్రేరేపించబడి, ఈ సందేశములో దేవునికై కృతజ్ఞత కలిగిన జీవనశైలిని నిజముగా జీవించుటకు ఇవ్వబడిన ఆచరణాత్మక విధానాలను మీరు స్వీకరించుదురు గాక.
The Judgement Seat of Christ - క్రీస్తు న్యాయపీఠం
క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడుటకు మీరు సంతోషంతో వేచి చూస్తున్నారా లేక ఆందోళనలో ఉన్నారా? పరిణితి చెందిన విశ్వాసుల కొరకైన ఈ కనువిప్పు కలిగించే సందేశములో పాస్టర్ బెంజమిన్ కొమానపల్లి జూనియర్ గారు నూతన నిబంధన విశ్వాసులు దేవుని బహుమానాలు మాత్రమే కాదు కానీ, క్రీస్తు న్యాయపీఠము వద్ద మన కొరకు వేచియున్న ప్రతిఫలాలను పొందుకొనే జీవితాన్ని జీవించే బాధ్యత మనకుందనే విషయాన్ని తెలియజేస్తున్నారు మీ ప్రతి మంచి పనికి సమృద్ధిగా ప్రతిఫలం పొందుటకు క్రీస్తు ఎదుట సంతోషముతో నిలబడియుందురు గాక!